Illu illalu Pillalu: ఊళ్లో దొంగలు పడ్డారు.. శ్రీవల్లి దొరికిపోయిందిగా!
on Jun 27, 2025
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-195 లో.. ధీరజ్, ప్రేమ ఎగ్జామ్ రాసాక.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. నా ఆర్థిక పరిస్థితి బాలేదని ప్రేమ అనగా.. అదేంటే మాకు ఎంతో సహాయం చేశావ్.. లక్షల్లో ఫీజు కట్టావ్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయావని ప్రేమ స్నేహితురాలు అనగానే.. అందరి రాత ఒకేలా ఉండదని చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇక అదంతా ధీరజ్ విని బాధపడతాడు. ఇక మరోవైపు రామరాజు దగ్గరికి తిరుపతి వచ్చి. ఊళ్ళో జరిగిన దొంగతనాల గురించి చెప్తాడు. దొంగలు పది ఇళ్ళకి పైగా దోచుకున్నారని తిరుపతి చెప్పగానే డబ్బులన్నీ బ్యాంకులో వేసి రమ్మంటాడు.
నగలు కూడా వేయాలని వేదవతి అంటుంది. ఆ మాటతో శ్రీవల్లి గుండెల్లో రాయి పడిపోతుంది. అవునండీ.. నా నగలు, పిల్లలు నగలు, కోడళ్ల నగలు బోలెడన్ని ఉన్నాయి.. దొంగలు పడి వాటిని పట్టుకుని వెళ్తే ఏంటి పరిస్థితి అని వేదవతి అంటుంది. అవును కదా.. ఆ విషయమే మర్చిపోయాను. పైగా వల్లీ వాళ్ల అమ్మ గారు చాలా నగలు పెట్టారు. పొరపాటున ఆ నగలు మన ఇంట్లో ఉన్నప్పుడు పోతే మనకే చెడ్డపేరు.. రేపే నీ నగలు, కోడళ్ల నగలు, వల్లీ నగలు తీసుకుని వెళ్లి బ్యాంక్‌లో పెట్టేయ్ అని అంటాడు రామరాజు. మామయ్య గారు చెప్పింది వినిపించింది కదా.. నగలన్నీ తీసి రెడీగాపెట్టమని వేదవతి అంటుంది. వామ్మో ఆ నగలు గిల్టు నగలు అని తెలిస్తే.. నా బండారం మొత్తం బయటపడిపోతుందంటూ శ్రీవల్లి ఏడుపు మొదలుపెడుతుంది.
ఇక గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి.. భాగ్యానికి ఫోన్ చేస్తుంది. తన ఫోన్ పనిచేయకపోవడంతో.. ఏం చేయాల్రా దేవుడా.. మా యమ్మ అబద్దాల మీద అబద్దాలు చెప్పి.. మోసాల మీద మోసాలు చేసి నా పెళ్లి చేసి పారేసింది. అవన్నీ నా మెడకి పాములా చుట్టేశాయి. ఈ నగల్ని లాకర్‌లో పెడితే అడ్డంగా దొరికిపోతానే అంటూ శ్రీవల్లి తలపట్టుకుంటుంది. ఇంతలో పెద్దోడు చందు వచ్చి.. అక్కడున్న నగల్ని చూస్తాడు. ఏంటి ఇవి బయటపెట్టావని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏం లేదు బావా.. ఊరికనే ఒకసారి చూసుకుందాం అని పెట్టానులే అని అంటుంది. హో సరదాగానా? సర్లే కానీ.. ఊరిలో దొంగలు పడ్డారని.. మన ఇంట్లో నగలు జాగ్రత్త అని పెద్దోడు అంటాడు. ఆ దొంగ వెధవలు.. ఈ ఇంట్లో పడి.. వీటిని ఎత్తుకుపోతే ప్రశాంతంగా ఉండేదాన్ని అని శ్రీవల్లి అనుకుంటుంది.
సర్లే కానీ.. మీ అమ్మని పది లక్షలు అడగమని చెప్పాను కదా.. ఏమైంది.. ఇప్పుడు ఇస్తుందని అడుగుతాడు పెద్దోడు. ఫోన్ చేశాను బావా కలవగానే అడుగుతానని శ్రీవల్లి అంటుంది. మీ అమ్మ ఎప్పుడు ఇస్తుందో ఏమో కానీ.. ఆ సేటు ఎప్పుడు మా ఆఫీస్‌కి వచ్చి డబ్బులు అడుగుతాడోనని భయంగా ఉంది. రేపటి వరకూ చూస్తాను.. మీ అమ్మ వాళ్లు డబ్బులు ఇచ్చారా సరేసరి లేదంటే నేనే ఉదయాన్నే డబ్బుల కోసం మీ ఇంటికి వెళ్తానని తెగేసి చెప్తాడు. దాంతో తలపట్టుకున్న శ్రీవల్లి.. ఓ వైపు నగల టెన్షన్.. ఇంకో వైపు పది లక్షల టెన్షన్.. ముందు చూస్తే నుయ్యి.. వెనక చూస్తే గొయ్యి.. టెన్షన్ తోనే పోయేట్టు ఉన్నాను దేవుడు.. ఈ ప్రమాదం నుంచి ఎలా గట్టెక్కుతానోనని ఏడుస్తుంది శ్రీవల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



